అండగా ఉంటా


Fri,November 8, 2019 01:18 AM

-ఎల్లవేళలా సహకరిస్తా..
-మనోధైర్యంతో ముందుకెళ్లండి..
-రెవెన్యూ ఉద్యోగులకు కలెక్టర్ భరోసా
-నాలుగో రోజూ విధుల బహిష్కరణ
-విజయారెడ్డి మృతికి సంతాపంగా కొవ్వొత్తులతో నివాళి


జగిత్యాల, నమస్తే తెలంగాణ : జగిత్యాల రెవెన్యూ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ భరోసాను కల్పించారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి, సజీవ దహన హత్యాకాండను నిరసిస్తూ, జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి వీఆర్‌ఏల వరకు గురువారం విధులు బ హిష్కరించారు. శుక్రవారం సైతం విధులు బహిష్కరించనున్నట్లు వివిధ ఆందోళన ప్రదర్శనలు ఉంటాయని రెవెన్యూ ఉద్యోగుల జిల్లా శాఖ పే ర్కొంది. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విజయారెడి దారుణ హత్యపై సంతాప సమావేశాలు, మనోధైర్య సమావేశాలు కలెక్టర్ నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లవేళలా నేను మీ అందరిక అండగా ఉంటాననీ, అర్ధరాత్రులయినా సరే నా సహకారం ఉంటుందన్నారు. ఎవరూ బెదిరింపులకు గురి చేసినా మనోధైర్యతో ప్రజలకు న్యాయం చేయలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తారని రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తాననీ, రెవెన్యూ సిబ్బంది యావత్తు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అతి బాధ్యతతో అందజేస్తారన్నారు.

రెవెన్యూ ఉద్యోగులపై, అధికారులపై దాడులు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం మాట్లాడుతూ మాఫీయా శక్తులు ఎదిరించినా ధైర్యం కోల్పోవద్దనీ, తన విధి నిర్వహణలో ఎదుర్కొన్న విషయాలను తెలుపుతూ ధైర్యం కోల్పోవద్దనీ, తన విధి నిర్వహణలో ఎదుర్కొన్న విషయాలను తెలుపుతూ ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటూ ప్రజలకు న్యాయం చేయడానికి ముందుండాలన్నారు. జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆధ్వర్యంలో మీకు తోడుంటామన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గౌతం పోట్రూ, డీఆర్వో అరుణశ్రీ, కలెక్టరేట్ ఎవో వెంకటేశ్, బోగ శశిధర్, ఎండీ వకీల్, తాసిల్దార్లు, 18 మండలాల రెవెన్యూ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

58

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles