అంగన్‌వాడీ కేంద్రాల్లో సామూహిక సీమంతం


Fri,November 8, 2019 01:14 AM

పెగడపల్లి: మండలంలోని పలు అంగన్‌వాడీ కేం ద్రాల్లో గురువారం గర్భిణులకు సామూహిక సీ మంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. రాంబదృనిపల్లి కేం ద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ కోరుకంటి రాజేశ్వర్‌రా వు పాల్గొని పండ్లు, ఐరన్ మాత్రలు పంపిణీ చే శారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్ర భుత్వంచే నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేవికొండలో చిల్డ్రన్స్ వేడుకలు నిర్వహించగా, కీచులాటపల్లి, సుద్దపల్లి, పెగడ పల్లి, ఆరవల్లిలో పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు, సిబ్బంది పాల్గొన్నారు.


చిన్నారులకు అన్నప్రాసన..
గొల్లపల్లి: గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రా మంలోని రాజులపల్లి అంగన్ వాడీ కేంద్రంలో గు రువారం సర్పంచ్ మిలుకూరి అనసూర్య చం ద్ర య్య ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక అన్నప్రాసన చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లా డుతూ అంగన్‌వాడీ కేంద్రం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠి కాహా రం అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ మమత, రాజులపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జ్ఞానేశ్వర్, రమేశ్, అంగన్‌వాడీ టీచర్ సయిండ్ల రజిత, ఆశా వర్కర్ లత తదితరులు పాల్గొన్నారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles