గాఢాంధకారాన్ని తొలగించేదే కార్తీక మాసం


Fri,November 8, 2019 01:14 AM

మారుతీనగర్ : మనలోని గాఢాంధకారాన్ని తొలగించేదే ఈ కార్తీక మాసమని ఇస్కాన్ మందిర నిర్వాహకుడు నరహరిదా సు పేర్కొన్నారు. గురువారం మెట్‌పల్లి పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భక్తులకు ఉపదేశించారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో దీపారాధనతో అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని స్కంధ పురాణంలో వివరించబడిందని తెలిపారు. అంతే కాకుండా ఈ మాసంలో వెలిగించే దీపం మన పూర్వీకులు ఉత్త మ పుణ్యలోకాలకు దారిచూపే వెలుగును ప్రసాదించబడుతుందని వేదాలు చెబుతున్నాయని భక్తులకు వివరించారు. కాగా, పెద్దసంఖ్యలో భక్తులు, మహిళలు దీపారాధనలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకపూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మహాజన్ నర్సింలు, హరేకృష్ణ భక్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, తదితరులున్నారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles