వైద్యులు సమయపాలన పాటించాలి


Fri,November 8, 2019 01:13 AM

రాయికల్ రూరల్ : వైద్యులు సమయ పాలన పాటించి మెరుగైన సేవలందించాలని ఎంపీపీ సంధ్యరాణి వైద్యులకు సూచించారు. రాయికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని వార్డులను కలియ తిరుగుతూ బాలింతలను వైద్యులు అందజేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రాయికల్ మండలం కిష్టంపేట్ ఎంపీటీసీ జాన సాగరిక ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకొని ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ దవాఖా నలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తుందని అందుకు ప్రభుత్వం నిధులను వెచ్చిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీని అభినంధించారు. ఎంపీటీసీ దొంతి నాగరాజు, వైద్యుడు ప్రవీణ్ చంద్ర, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles