కనుల పండువలా గోదావరి హారతి


Fri,November 8, 2019 01:13 AM

ధర్మపురి,నమస్తేతెలంగాణ : ధర్మపురిలో గోదావరిహారతి కనుల పండువలా కొనసాగుతున్నది. గురువారం పదో రోజు దేవస్థానం నుంచి సాయం త్రం వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరలతో మంగళవాయిద్యాలు వెంటరాగా, అర్చకులు, సిబ్బంది, భక్తులు గోదావరి నది వరకు శోభాయాత్రగా వెళ్లారు. గోదావరి ఒడ్డున వేద బ్రాహ్మణులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదావరికి హారతి పట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సతీమణి పార్వతీశరత్, వేదపండితులు బొజ్జ రమేశ్ శర్మ, ముత్యాల శర్మ, సూపరింటెండెంట్ ద్యావ ళ్ల కిరణ్‌కుమార్, అర్చకులు బొజ్జ సంతోష్‌కుమార్, సంపత్‌కుమార్, బొజ్జ రాజగోపాల్, ఉప ప్రధాన అర్చకు లు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ దేవయ్య, వెంకటరవీందర్, తిరుపతి భక్తులు తదితరులున్నారు.

32

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles