జాతీయ స్థాయిలో రాణించాలి


Thu,November 7, 2019 12:30 AM

-విద్యార్థులు తెలంగాణ పేరు నిలబెట్టాలి
-అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చూపాలి
-ఎస్‌జీఎఫ్‌కు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
-జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
-రాష్ట్రస్థాయి కరాటే పోటీలు ప్రారంభం


జగిత్యాల లీగల్: క్రీడాకారులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించి తెలంగాణ రాష్ట్ర పేరు నిలబెట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆత్మరాం ఫంక్షన్‌హాల్‌లో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జగిత్యాల ఆధ్వర్యంలో 65వ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండర్-14 బాలబాలికల రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రస్థాయి కరాటే పోటీలు జగిత్యాలలో జరగడం గర్వకారణమన్నారు. చిన్నారులు చిన్నతనం నుంచే క్రీడల్లో రాణించడంతో శారీరక శ్రమతో చదువులోనూ క్రీడల్లోనూ అద్భుతంగా రాణిస్తారన్నారు. ఎస్‌జీఎఫ్‌కు అవసరమైన సౌకర్యాలను క్రీడాశాఖ మంత్రి తో మాట్లాడి కల్పిస్తామన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. చిన్నప్పటి నుంచే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించిన తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. నియోజకవర్గంలో నిజామాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్ని హైస్కూల్‌లకు గతంలోనే డబుల్ డెస్క్ బెంచీలను అందించారన్నారు. జిల్లా గత మూడేళ్లుగా పదో తరగతిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందనీ, క్రీడల్లో సైతం ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. టోర్నమెంట్‌కు తన పూర్తి సహాయ సహకారాలను అందిస్తానన్నారు. అంతకుముందు మల్యాల మండలం తాటిపెల్లి టగురుకుల పాఠశాల విద్యార్థుల సాం స్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యేను టోర్నమెంట్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. టోర్నమెంట్‌లో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 210మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 1నుంచి 6వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగే జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ వొడ్నాల శ్రీనివాస్, స్టేట్ అబ్జర్వర్లు పార్థసారథి, సత్యనారాయణ, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పడాల విశ్వప్రసాద్, ప్రధాన కార్యదర్శి సుంచు అశోక్, రాష్ట్ర పెటా బాధ్యులు పడాల కృష్ణప్రసాద్, చంద శ్రీనివాసరావు, తాటిపెల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పత్తెం శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆరుముళ్ల పవన్, పీఈటీలు లక్ష్మీరాంనాయక్, కందుకూరి అజయ్‌బాబు, సాగర్, రవీందర్, వేణు, దయాకర్, కిశోర్, కోటేశ్వర్‌రావు, వెంకటలక్ష్మి, రాధి క, కరాటే కోచ్‌లు, ఇన్‌స్ట్రక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

54

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles