క్రీడాకారుడికి సాయం


Thu,November 7, 2019 12:28 AM

ధర్మారం: మండల కేంద్రంలోని సామవేద జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న నంది మేడారం గ్రామ నివాసి ఎంపెల్లి రాజు అనే క్రీడాకా రుడికి జడ్పీటీసీ దంపతులు పూస్కూరు పద్మ-జితేందర్‌రావు నగదు అందించారు. ఈ విద్యార్థి ఎస్జీఎఫ్ వాలీబాల్ విభాగంలో ఉమ్మడి జిల్లా తరపున గత నెలలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. రాజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో పలువురు దాతలు స్పందించారు. ధర్మారం సర్పంచ్ జితేందర్‌రావు ఆ విద్యార్థికి ఐదువేలను బుధవారం అందజేశారు. అదే విధంగా నంది మేడారం సర్పంచ్ సామంతుల జానకి-శంకర్ దంపతులు రూ. వెయ్యి అందజేసి ప్రోత్సహించారు. తనకు సాయం అందించిన దాతలకు రాజు కృతజ్ఞతలు తెలిపారు.

41

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles