షటిల్ కోర్ట్ నిర్మాణానికి నగదు వితరణ


Thu,November 7, 2019 12:28 AM

ఓదెల: కనగర్తి హైస్కూల్‌లో షటిల్ కోర్ట్ నిర్మాణానికి ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు 5వేలు ప్రధానోపాధ్యాయుడు నరేంద్రాచారికి బుధవారం అంద జేశారు. ఈ పాఠశాలలో 1994-95లో ఎస్‌ఎస్‌సీ పూర్తి చేసిన విద్యార్థులు బడిలో పిల్లలు ఆడుకునేందుకు షటిల్ కోర్ట్ నిర్మించుకునేందుకు ఆర్థికసాయం చేశారు. ఈ డబ్బులు కిచెన్ గార్డెన్‌కు కూడా ఉపయోగపడిందన్నారు. ఇందులో పూర్వ విద్యార్థులు రామగిరి రాజు, ఎండీ యూసుఫ్, గంధశ్రీ వెంకటేశ్వర్లు, పిట్టల రవి పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించిన పూర్వ విద్యార్థులను హెచ్‌ఎం అభినందించారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles