రైతులు అధైర్యపడవద్దు


Thu,November 7, 2019 12:27 AM

కొడిమ్యాల: ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతులు అధైర్యపడవద్దనీ, ప్రభుత్వం అండగా ఉం టుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని తిప్పాయపల్లి, చెప్యాల, కొడిమ్యాల, కోనాపూర్, సూరంపేట, డబ్బుతిమ్మాయపల్లి, చింతల్లపల్లి గ్రామాల్లో సెర్ప్ (ఐకేపీ) ఆధ్వర్యంలో నల్లగొండలో పూడూర్ సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్షాల కారణంగా తడిసి, రంగు మారిన ధాన్యాన్నీ సైతం కొనుగోలు చేస్తామని చేస్తామన్నారు. ఈ విషయంలో రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దన్నారు. 2014కి ముందు తెలంగాణ ప్రాంతం నీళ్లు లేకుండా ఎడారిగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరంతోపాటు వివిధ రకాల ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ నిర్మించి రైతాంగానికి సాగునీరు అందించారని చెప్పారు. గ్రావిటీ కాలువల ద్వారా మెట్ట ప్రాంతాలను ఎల్లంపల్లి జలాలను తరలించామన్నారు. తెలంగాణ ధాన్యాగారంగా మారబోతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడికి ఏడాదికి ఎకరానికి 10వేలు అందిస్తునట్లు తెలిపారు. రైతుబీమాతో రూ.5లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ప్రభుత్వం ఏ-గ్రేడ్ రకం క్వింట్ వరి ధాన్యానికి 1,885, బీ-గ్రేడ్‌కు 1,835 చెల్లిస్తున్నదని తెలిపారు.


అనంతరం మండల కేంద్రంలోని సుదరానగర్ బీసీ కాలనీని ఎమ్మెల్యే పరిశీలించారు. కాలనీలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించి, ఆలయ ఆవరణలో హైమస్ట్ లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మల్యాల మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్, ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, కోఆప్షన్ సభ్యుడు నసిరుద్దీన్, పూడూర్ సింగిల్‌విండో చైర్మన్ అబ్బిడి లకా్ష్మరెడ్డి, వైస్‌చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచులు మ్యాకల లత, పిల్లి మల్లేశం, ఉట్కూ రి రాజశేఖర్‌రెడ్డి, ఏలేటి మమత, దర్శనాల కౌసల్య, చెక్కపల్లి స్వామిరెడ్డి, మల్యాల మహిపాల్, డబ్బు రాధ, ఎంపీటీసీలు ఉట్కూరి మల్లారెడ్డి, సామల్ల లక్ష్మణ్, జమాల్‌పూరి రాజేశ్వరి, గుగులోత్ సూజాత, డబ్బు జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీఎం దేవరాజం, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మేన్నేని రాజనర్సింగారావు, మండలాధ్యక్షుడు అనుమండ్ల రాఘవరెడ్డి, నాయకులు మ్యాకల మల్లేశం, చీకట్ల మహేందర్, ఏలేటి నర్సింహరెడ్డి, గుగులోత్ వినోద్, డబ్బు గౌతంరెడ్డి, ముత్యంరెడ్డి, బాపురెడ్డి, గుంటి ఎల్లయ్య, గడ్డం జీవన్‌రెడ్డి, ఐలాపురం బాలరాజు పాల్గొన్నారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles