లాడ్జీల్లో పోలీసుల సోదాలు


Thu,November 7, 2019 12:27 AM

మల్యాల: మండలంలోని ముత్యంపేటకు అనుబంధంగా ఉన్న కొండగట్టు దిగువన గల లాడ్జీల్లో గదులు, అద్దెకిచ్చే వసతిగృహాలను సీఐ కోరె కిషోర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ ఆదేశాల మేరకు మంగళవారం అర్థరాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లాడ్జీ లో గల రికార్డుల వివరాలతో పాటు అసాంఘీక కార్యకలాపాలను నిర్మూలించేందుకు సోదాలు నిర్వహించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ, లాడ్జీల్లో మైనర్లు, పెళ్లికాని యువతీయువకులకు గదులను ఇవ్వవద్దని సూచించారు. అసాంఘీక కార్యకలాపాలను ప్రోత్సహించవద్దని కోరారు. లాడ్జీల యజమానులు సరైన గుర్తింపు కార్డులు లేకుండా గదులను ఇవ్వవద్దన్నారు. అనంతరం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌లను లాడ్జీ యజమానులకు అందజేశారు. ఆయన వెంట ఎస్‌ఐ ఉపేంద్రచారి, బ్లూ కోట్ సిబ్బంది పాల్గొన్నారు.

44

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles