రెవెన్యూ నిరసన జ్వాల


Tue,November 5, 2019 03:36 AM

-తాసిల్దార్ సజీవ దహనంపై జిల్లా ఉద్యోగుల ఆగ్రహం
-తాసిల్ ఆఫీసుల ఎదుట నిరసనలు
-కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో ధర్నా
-బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శరత్‌కు వినతిపత్రం
-నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్


(జగిత్యాల బృందం, నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల తాసిల్దార్ విజయారెడ్డిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన దుండగుడిపై, అతడి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అం తటా రెవెన్యూ ఉద్యోగులు సోమవారం ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొన్నిచోట్ల విధులను బహిష్కరించగా మరికొన్ని చోట్ల నల్లబ్యాడ్జీలతో ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ రెవె న్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ శరత్‌కు రెవెన్యూ ఉద్యోగులు వినతిపత్రం అందించారు. తాసిల్దార్ విజయారెడ్డి మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు, అధికారులపై ఇ సుక, భూ మాఫియా దాడులు తారస్థాయికి చేరుకున్నాయనే దానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. మెట్‌పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కోరుట్ల తాసిల్దార్ కార్యాలయం ఎదుట రెండు నిమిషాలు మౌనం పాటించి శ్ర ద్ధాంజలి ఘటించారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూ ర్, మేడిపల్లి, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి, సా రంగాపూర్, మల్యాల, కొడిమ్యాల, జగిత్యాల త దితర మండల కేంద్రాల్లో ఆందోళనలు, నిరసన కొనసాగాయి.

54

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles