సిద్దిపేట జిల్లాలో ధర్మారం సర్పంచులు


Tue,November 5, 2019 03:34 AM

ధర్మారం : రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రోత్సాహంతో ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం, వెల్గటూరు మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ పార్టీకి చెంది న సర్పంచులు సిద్దిపేట జిల్లాలో పలు ఆదర్శ ప్రాంతాలను పరిశీలించారు. ఈ మేరకు సోమవారం ధర్మారం మండలంలోని సర్పంచులు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఖిలావనపర్తికి చెందిన పార్టీ నాయకుడు సాగంటి కొండయ్యతోపాటు మంత్రి ఈశ్వర్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మోహన్‌బాబు ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఆదర్శవంతంగా అభివృద్ధి చెందిన సిద్దిపేట జిల్లా కేం ద్రంతో పాటు గుర్రాలగొండి, ఇబ్రహీంపూర్ గ్రామాలను సర్పంచులు సందర్శించి అ క్కడ జరిగిన అభివృద్ధ్ధి పనులను పరిశీలించారు.


సందర్భంగా సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్‌రావు మాట్లాడుతూ మండలంలోని సర్పంచులందిరిని సిద్దిపేట జిల్లాలోని పలు మోడల్ గ్రామాల సందర్శనకు పంపించిన మంత్రి ఈశ్వర్‌కు సర్పంచుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. తాము సందర్శించిన గ్రామాలు ఎంతో ఆకర్శణీయంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అన్నారు. ఆ గ్రామాల స్ఫూర్తితో మండలంలోని గ్రామాలను మంత్రి ఈశ్వర్ సహకారంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దటానికి ప్రయత్నం చేస్తామని అన్నారు.

48

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles