కలెక్టర్‌కు రెవెన్యూ ఉద్యోగుల సంఘం వినతి


Tue,November 5, 2019 03:33 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ విజయారెడ్డిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన దుండగుడిపై, అత డి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంత రం కలెక్టర్ శరత్‌కు రెవెన్యూ ఉద్యోగులు వినతిపత్రం అందించారు. సోమవారం తాసిల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురి కాగా, ఆమె మృతి కి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం లో రెవెన్యూ ఉద్యోగులు, అధికారులపై ఇసుక, భూ మాఫియా దాడులు తారాస్థాయికి చేరుకున్నాయనే దానికి విజయారెడ్డి సజీవదహనం నిదర్శనమన్నారు. పోలీసులు తక్షణమే స్పందించి, హత్యకు పాల్పడ్డ వ్యక్తితోపాటు అతడి వెనుక ఉ న్న శక్తులను కూడా వెంటనే అరెస్టు చేసి కఠిన చ ర్యలు తీసుకోవాలన్నారు.


ఇలాంటి హత్యలు, దా డులు పునరావృతం కాకుండా రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి నిర్ణయం మే రకు భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో హరి అశోక్ కుమార్, ఎండీ వకీల్, బోగ శశిధర్, కృష్ణ, ఏఓ వెంకటేశ్, తుకారం, సు భాష్ చందర్, శ్రావణ్, తిరుమల్ రావు, సత్యనారాయణ, ఎండీ ఖాధర్, ముదాం రవి, మహమూద్, హన్మంతరెడ్డి, శ్రీనివాస్, రా జేందర్ రా వు, వేణుగోపాల్, నాగార్జున, ప్రీతి, చంద్రిక, రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు పాల్గొన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles