గిరీశ్ మా కుటుంబ సభ్యుడిలా మెలిగాడు


Tue,November 5, 2019 03:33 AM

జగిత్యాల రూరల్ : గిరీశ్ మా కుటుంబ సభ్యునిగా మెలిగాడనీ, అలాంటి మంచి వ్యక్తి దూరం కావడం చాలా బాధాకరమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ధరూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్ద సోమవారం మృతదే హం కోసం గాలింపు చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు - సరోజన దంపతులు కన్నీరు ము న్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి ద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఆరేళ్లుగా పీఏగా పనిచేస్తున్న గిరీశ్ గల్లంతు కావడం దురదృష్టకరమన్నారు. ఆదివారం తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లిన గిరీశ్ గల్లంతయ్యాడనీ, ఇప్పటివరకు ఆచూకీ లభ్యం కాలేదన్నారు. గత ఆరేళ్లుగా తన వద్ద పీఏగా ప నిచేస్తూ 90శాతం తన పనులన్నీ చేసేవాడన్నారు. గిరీశ్ లాంటి వ్యక్తి మరొకరు దొరకరని ఆవేదన వ్యక్తం చే శారు. శనివారం సాయంత్రం 7గంటల వరకు తనతో నే ఉన్నాడనీ, ప్రతి ఆదివారం పిల్లలతో గడపమని తా నే చెప్పానని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.46 నిమిషాలకు ఫోన్ చేసి సుమారు 50నిమిషాల పాటు మాట్లాడాననీ, ఈ నె 7వ తేదీన ప్రోగ్రాం ఉం దని నోట్ చేసుకోమని చెప్పానని పేర్కొన్నారు.


ఆదివా రం సాయంత్రం 5గంటలకు గిరీశ్ గల్లంతయ్యాడ ని ఫోన్ రావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నా రు. గిరీశ్ మంచితనాన్ని చూసైనా భగవంతుడు కాపాడి ఉంటి బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. గిరీశ్ ఎ న్నడూ కూడా ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. కా ర్యకర్తలందరికి గిరీశ్ నోట్లో నాలుకలా మెదిలేవాడనీ, కార్యకర్తలందరికీ ఎప్పుడూ ఎలాంటి సమస్య వచ్చినా సాయం చేసేవాడన్నారు. అలాంటి వ్యక్తి గల్లంతవడం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. గిరీశ్ ఆచూకీ కోసం పోలీసులతోపాటు తమ కార్యకర్తలు సైతం విస్తృతంగా గాలిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వి ద్యాసాగర్ రావు ఎస్సారెస్పీ ఉన్నతాధికారులతో మా ట్లాడి ఎస్సారెస్పీలో నీటి ప్రవాహాన్ని పూర్తిగా తగ్గించాలని కోరడంతో అధికారులు నీటి ప్రవాహాన్ని నియంత్రించారు. సోమవారం డీఎస్పీతో మాట్లాడుతూ గా లింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.

కన్నీరు మున్నీరైన ఎమ్మెల్యే దంపతులు
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పీఏ గిరీశ్ ఎస్సారెస్పీ కెనాల్‌లో గల్లంతు కావడంతో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ - సరోజన దంపతులు కన్నీ రు మున్నీరుగా విలపించారు. గిరీశ్ నివాసముండే ధరూర్‌లోని శ్రీకృష్ణ అపార్ట్‌మెంట్‌లో గిరీశ్ కుటుంబ సభ్యులను జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత - సురేష్ దంపతులతో కలిసి పరామర్శించారు. గిరీశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles