నేత్రపర్వంగా గోదావరి హారతి


Tue,November 5, 2019 03:33 AM

ధర్మపురి నమస్తే తెలంగాణ : పట్టణంలోని గోదావరి నదీ మాత హారతి కార్యక్రమం సోమవారం నేత్రపర్వంగా సాగింది. కార్తీకమా సం ఏడో రోజు సాయంత్రం ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయ నుంచి వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలు మంగళవాయిద్యాలతో అర్చకులు, సిబ్బంది, భక్తులు గోదావరి నదీ తీరానికి తరలివ చ్చి, అక్కడ పూజలు చేశారు. అనంతరం నదీమాతకు ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చారు. అనంతరం మహిళలు కార్తీక దీ పాలను నదిలో వదిలారు. కార్యక్రమం లో సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్‌కుమార్, వేదపండితులు ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్‌కుమార్‌శర్మ, అర్చకులు బొజ్జ సంతోష్‌కుమార్, సంపత్‌కుమార్, బొజ్జ రాజగోపాల్, ఉప ప్రధాన అర్చకు లు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ దేవయ్య, వెంకటరవీందర్, తిరుపతి పాల్గొన్నారు.


ఆలయంలో భక్తుల సందడి
కార్తీకమాసం సందర్భంగా ధర్మపురి ఆలయం భ క్తులతో రద్దీగా కనిపించింది. పెద్ద సం ఖ్యలో భక్తులు తరలివచ్చి, గోదావరిలో స్నానాలు చేసి, దీపాలను వదిలారు. పలువురు పురోహితులతో సంకల్పాలు చెప్పించుకుంటున్నారు. అనంతరం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బా రులు తీరి యోగ, ఉగ్ర నారసింహస్వామితో పాటు వేంకటేశ్వరస్వామి వారలను దర్శించుకున్నారు. సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles