పేదింటి యువతి పెళ్లికి కొప్పుల ఆర్థిక సాయం


Tue,November 5, 2019 03:33 AM

బుగ్గారం : నిరుపేదింటి యువతి పెళ్లికి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. మండలంలోని మద్దునూర్‌కు చెందిన నిరుపేద యువతి సింగరి భూలక్ష్మి వివాహానికి ఎల్‌ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.25వేలు అందించారు. ట్రస్టు అధ్యక్షురాలు, మంత్రి సతీమణి కొప్పుల స్నేహలత భూలక్ష్మికి నగదుతో పాటు పట్టుచీర అందించి, ఆశీర్వదించారు. గ్రామస్తులు ముందుకు వచ్చి రూ.లక్ష ఆర్థిక సాయం అందించడంపై అభినందించారు. ఇక్కడ గ్రామ ఎంపీటీసీ గాలిపల్లి మహేశ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రాచమడుగు సతీశ్‌రావు, మహిళా అధ్యక్షురాలు తరాల వెంకటమ్మ ఉన్నారు.

29

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles