ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో వేడుకలు వైభవంగా సాగుతున్నాయి


Mon,November 4, 2019 01:23 AM

-భక్తిశ్రద్ధలతో గోదావరికి హారతి
-ఆరో రోజూ వైభవంగా కార్యక్రమం
-నదిలో దీపాలు వదిలిన మహిళలు
-నర్సన్న సన్నిధిలో భక్తుల రద్దీ


ధర్మపురి, నమస్తే తెలంగాణ : కార్తీక మాసాన్ని పుర్కరించుకొని ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం ఆలయం ఆధ్వర్యంలో గోదావరి నదీ తల్లికి హారతి ఇ చ్చారు. సాయంత్రం వేళలో వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలతో అర్చకులు, సిబ్బంది, భక్తులు గోదావరి వరకు శోభాయాత్రకు తరలివచ్చారు. అనంతరం నదీమాతకు ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చా రు. మహిళలు, చిన్నారులు గోదావరిలో కార్తీకదీపాలను వదిలారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్‌కుమార్, వేదపండితులు ముత్యాల శర్మ, అర్చకులు బొజ్జ సంతోష్‌కుమార్, సంపత్‌కుమార్, బొజ్జ రాజగోపాల్, జూనియర్ అసిస్టెంట్ దేవయ్య, వెంకట రవీందర్ పాల్గొన్నారు.
ఆలయంలో భక్తుల రద్దీ
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధి భక్తులతో సందడిగా కనిపించింది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. మొదట గోదావరిలో స్నానాలు చేసి.. పురోహితులతో సంకల్పాలు చెప్పుకున్నారు. అనంతరం ప్రధాన దేవాలయమైన లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో క్యూలైన్లో బారులు తీరి, యోగ, ఉగ్ర నారసింహ, వేంకటేశ్వరస్వామి వారలను దర్శించుకున్నారు. దేవస్థానం సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles