అల్ఫోర్స్ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్


Mon,November 4, 2019 01:20 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్స్, నాలెడ్జ్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు జెస్ట్‌డయల్ లిమిటెడ్ అనే శోధన సంస్థలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జిల్లాలోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆశాశైని, సాయి నిహారిక, అశ్విని, మేఘకలు ఎంపికయ్యారని తెలిపారు. వీరిని కళాశాల కరస్పాండెంట్ వీ రవీందర్‌రెడ్డి ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని క్యాంపస్ నియమాకాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపించి ఉద్యోగాలకు ఎంపి కవుతున్నారని సూచించారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంచుకొని మరింత ఉన్నత స్థానాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles