రైతులను ప్రభుత్వం ఆదుకుంటది


Mon,November 4, 2019 01:20 AM

పెగడపల్లి : మండలంలో భారీ వర్షాలతో పంట లు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని మండల ప్రజాప్రతినిధులు భరోసానిచ్చారు. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఇనుకొండ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం రాంభద్రునిపల్లి, ఏడుమోటలపల్లి గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కోతకు వచ్చిన వరి పొలాలు వర్షంతో నేల కొరగడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందనీ, అలాగే కళ్లాల్లో ఆరబోసిన మక్కజొన్న, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొందన్నారు.


నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారని, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వివరించి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బ్యాంకుల తప్పిదంతో బీమా కంపెనీలు పరిహారం చెల్లించేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయనీ, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ల్యాగలమర్రి ఎంపీటీసీ మందపల్లి అంజయ్య, సర్పంచులు కోరుకంటి రాజేశ్వర్‌రావు, ఇస్లావత్ రవినాయక్, నాయకులు గోలి సురేందర్‌రెడ్డి, చిరంజీవినాయక్, బొల్లవేని మల్లేశం ఉన్నారు.

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles