వేములవాడలో భక్తజన సందోహం


Mon,November 4, 2019 01:19 AM

వేములవాడకల్చరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం కార్తీకమా సందర్భంగా ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజాము నుంచే ధర్మగుండంలో స్నానాలు చేశారు. పలువురు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. మరికొందరు స్వామి వారికి ప్రీతికరమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. అనంతరం క్యూలైన్‌లో బారులు తీరిన రాజన్నను దర్శించుకున్నారు. భక్తుల ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. దాదాపు 30వేలకుపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, రూ.19లక్షల వరకు ఆదాయం సమకూరిందని సిబ్బంది తెలిపారు. కాగా ఈఓ కృష్ణవేణి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.

32

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles