వైభవంగా అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ఠాపన


Mon,November 4, 2019 01:19 AM

ధర్మారం : ధర్మారం మండలం నంది మేడారం ఎస్సీకాలనీ వద్ద నిర్మించిన అభయాంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. మూడు రోజులుగా వేడుకలు జరుగుతుండగా చివరి రోజు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, ఆలయం ఎదుట స్తంభ స్థాపన కార్యక్రమానికి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్చకులు మంత్రి ఈశ్వర్‌కు పూలదండ వేసి, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద కొబ్బరికాయ కొట్టారు. అనంతరం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రి ఈశ్వర్‌ను సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ భక్తుల విరాళాలతో ఆల యం నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించడం అభినందనీయమన్నారు. కాగా, ఉద యం నుంచి వేడుకల సందర్భంగా ఆలయం లో ప్రాతఃకాలపూజ, శాంతి పూజ, శాంతి పా ఠం, అభయాంజనేయ స్వామి సహిత శివ పంచాయతన, ధ్వజస్తంభ కార్యక్రమాలను కనులపండువలా జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు అన్నదానం చేశారు.

44

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles