ఆర్టీసీ ఆదాయంపై సమీక్షించుకోవాలి


Sun,November 3, 2019 03:07 AM

-డిపోల వారీగా ప్రత్యేకాధికారులు వివరాలు తెలుసుకోవాలి
-ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలి
-డిపో మేనేజర్లతో కలెక్టర్ శరత్
-రైస్‌మిల్లర్లతోనూ సమావేశం
-ధాన్యం భద్రపరిచేందుకు గోదాములు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశం


జగిత్యాల, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ ఆదాయంపై సమీక్షించుకోవాలని కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా జిల్లాలోని మూ డు డిపో మేనేజర్లతో శనివారం కలెక్టర్ తన చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు డిపోల వారీగా ప్రతి రోజూ ఎంత ఆదాయం సమకూరింది. ఎంత మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణించారు. ప్రస్తుత ఆధాయం, ప్రయాణికుల సంఖ్య గురించి తెలుసుకుని సమీక్ష చేసుకోవా లని సూచించారు. సమస్యలేమైన ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రతి డిపో గతంలో నిర్ణయించిన మేరకే బస్సులు నడిపించాలనీ, రూటు ప్రకారం ఎక్కువ కలెక్షన్ తీసుకువచ్చిన వారికి శాశ్వత సిబ్బందికి మాదిరిగానే ప్రోత్స హాకాలను తాత్కాలిక సిబ్బందికి అందజేయాలన్నారు.

వారి పేర్లను కూడా బోర్డుపై రా యించాలని తెలిపారు. ప్రయాణికులకు టికెట్ ఇవ్వకుండా మోసాలకు పాల్పడిన వారిని వెంటనే విధుల నుంచి తొలగించి వారి పేర్లను కూడా బోర్డుపై రాయాల న్నారు. మండల పరిధిలో ప్రతి తాసిల్దార్ రోజూ కనీసం మూడు బస్సులను తనిఖీ చేయాలని ఆదేశించారు. విధులు నిర్వహించే తాత్కాలిక డ్రైవర్లకు, కండక్టర్లకు వి శ్రాంతి గదులు ఇవ్వాలన్నారు. ఒక రోజు ముందుగానే డ్యూటీ చార్ట్‌ను తెలియ జేయాలని సూచించారు. రాత్రి పూట నడిచే బస్సులు యథావిధిగా నడపాలన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్య క్రమంలో జేసీ బీ రాజేశం, మెట్‌పల్లి సబ్ కలెక్టర్ గౌతం పోట్రూ, రవాణా శాఖ అధికారి కిషన్‌రావు, డిపో మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం భద్రపరిచేందుకు గోదాములు ఏర్పాటు చేసుకోవాలి
జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం భద్రపరిచేందుకు గోదాములను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ శరత్ రైస్‌మిల్లర్లకు సూచించారు. జిల్లాలోని రైస్‌మిల్లర్ యజమానులతో శనివారం కలెక్టర్ మాట్లాడారు. వరికోతలు మొదలయ్యాయనీ, ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు చేయాలనీ, మీకు కా వాల్సిన ధాన్యం భద్రపరచుకోవడానికి గోదాములు, స్థలాలను సమకూర్చు కోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనీ, సమస్యలు ఎమైనా ఉంటే అధికారులకు తెలియజేస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఒక వేళ రైతులకు ఎలాంటి అసౌకర్యం కలిగించిట్లయితే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ ర్యాకులు 62 కావాలని రైస్ మిల్లర్లు కలెక్టర్‌కు కోరగా, వాటిని సమ కూర్చడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ బేతి రాజేశం, మార్కెటింగ్ శాఖ ఏడీ ప్రకాశ్, పౌరసరఫరాల శాఖ అధికారులు జితేంద్రప్రసాద్, రైస్ మిల్లర్ యాజమానులు తదితరులు పాల్గొన్నారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles