సమస్యల పరిష్కారానికి కృషి


Sun,November 3, 2019 03:04 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలో సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసు కుంటున్నామని జిల్లా సంక్షేమాధికారి బీ నరేశ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వయో వృద్ధుల, వికలాంగుల, మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో జిల్లా అధికారిగా నూతనంగా ఉ ద్యోగ బాధ్యతలు స్వీరించిన నరేశ్‌ను తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. సంఘం ఆధ్వర్యంలో ము ద్రించిన సీనియర్ సిటిజన్ల పిలుపు పత్రికలను జిల్లా అధికారి నరేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ జిల్లాలో సీనియర్ సిటిజన్లకు చేస్తున్న సేవలను అభినందించారు. సంఘం డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, గౌరిశెట్టి విశ్వనాథం, ఎండీ యాకూబ్, అలిశెట్టి ఈశ్వరయ్య, మానాల కిషన్, పబ్బా శివానందం, గంగాధర్, నారాయణ, విద్యాసాగర్, భీమయ్య, కరుణ, సింగం గంగాధర్, హన్మాండ్లు, రఘుపతి, క్రిష్టయ్య, జనార్దన్, మోర హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles