నేడు పెరిక వధూవరుల వివాహ పరిచయ వేదిక


Sun,November 3, 2019 03:04 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రపంచ పెరిక కుల వధూవరుల వివాహ పరిచయ వేదికను హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ మేరకు పెరిక కుల పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి సంఘం లిమిటెడ్ కన్వీనర్ సుంకరి ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. పెరిక కుల యువతీయువకులు ఈ కార్యక్రమానికి హాజరై, తగిన భాగస్వామిని ఎంచుకోవాలని కోరారు. వధూవరుల పూర్తి వివరాలను 9963013666 కు వాట్సాప్ చేయాలని కోరారు. పెరిక కుల యువతీ, యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వధూవరులతోపాటు రెండు ఫుల్, హాఫ్ సైజు పోస్టు కార్డు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. మ్యారేజీ బ్రోకర్లకు అనుమతి లేదన్నారు. 2010లో ఏప్రిల్ 10న ప్రారంభమైన ఈ వేదిక, ఇప్పటి వరకు 18 కార్యక్రమాలు నిర్వహించి 2400 పెండ్లిళ్లు కుదిర్చినట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 9989343932కు ఫోన్ చేయాలని సూచించారు.

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles