కొండగట్టు కిటకిట..


Sun,November 3, 2019 03:04 AM

మల్యాల : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి, శనివారం భక్తులతో కిటకిటలాడింది. చుట్టు పక్కల జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో అంజన్న క్షేత్రం కిక్కిరిసింది. శుక్రవారం నుంచే కొండపై బస చేసిన భక్తులు, శనివారం తెల్లవారు జామున కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో బారులు తీరారు. ఆం జనేయ స్వామి వారితోపాటు శ్రీ వేంకటేశ్వర స్వా మి, లక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని, మొ క్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాకార మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అష్టోత్తర శతనామావళి పూజ, స్వామి వారికి అభిషేకం, హారతి, తదితర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు వైరాగ్యం అంజయ్య, శ్రీనివాస శర్మ, ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్ రావు, సంపత్ పర్యవేక్షించారు.

32

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles