తుపాకి రాముడు సందడి


Sun,November 3, 2019 03:04 AM

జగిత్యాల టౌన్ : జిల్లా కేంద్రంలో బిత్తిరి సత్తి సందడి చేశారు. ఆయన హీరోగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన తుపాకి రాముడు సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా, జిల్లాలో సక్సెస్ టూర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాలలోని దుర్గరాజా కళామందిర్ థియేటర్‌లో హీరో బత్తిరి సత్తితోపాటు చిత్ర బృందం తుపాకి రాముడు సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా హీరో బిత్తిరి సత్తి మాట్లాడుతూ తుపాకి రాముడు చిత్రాన్ని ఆదరించిన తెలంగాణ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక అధ్యక్షుడు రాగుల పరశురామ్‌గౌడ్, కళాశ్రీ గుండేటి రాజు, బిత్తిరి సత్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమెడియన్ ఆర్.ఎస్.నంద, దుర్గ థియేటర్ యజమాని గొల్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, పుల్లయ్య, కళాకారులు బోగ అశోక్, మహిపాల్, మల్లిక్‌తేజ, సందీప్‌రావు, పలిగిరి రాజేందర్, సురేష్‌నాయక్ పాల్గొన్నారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles