అలుపెరుగని ఎమ్మెల్యే దాసరి..


Sun,November 3, 2019 03:03 AM

కలెక్టరేట్ : సింగిల్ యూజ్‌డ్ ప్లాస్టిక్ రహిత పెద్దపల్లిగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. ప్ర జల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆరుబయట పడేయద్దనీ, ఎక్కడా చెత్త లేకుండా చూడాలని కోరుతూ, స్వచ్ఛబాటను కొ నసాగిస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం లో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని నల్ల పోచమ్మవాడ, తెనుగువాడ, అమర్‌నగర్, ఫారం స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే దాసరి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న ప్లాస్టిక్ వాడకాలను నిర్మూలించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని తెలిపారు. చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి మున్సిపల్, గ్రామ పంచాయతీల సిబ్బందికి అప్పగించాలని కోరారు. మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నయీమ్ షా ఖాద్రీ, సానిటరీ ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్‌రెడ్డి, అధికారులు శివప్రసాద్, నాయకులు ఉప్పు రాజ్‌కుమార్, జడల సురేందర్, ఎండీ హబీబ్, కొండి సతీశ్, కొలిపాక నర్సయ్య, భూతగడ్డ అజయ్ పాల్గొన్నారు.

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles