సర్కారు వైద్యంపై భరోసా


Sat,November 2, 2019 01:43 AM

హుజురాబాద్, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. ఇందు లో భాగంగా ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ, పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నది. ఫలితంగా సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకంతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య కూడా పెరుగుతున్నది. హుజూరాబాద్ ప్రభుత్వ వైద్యశాలలో గతంలో నెలకు 30 కాన్పులకు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుండడంతో కాన్పుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఆగస్టు నెలలో వంద డెలివరీలు కాగా, సెప్టెంబర్ నెలలో 115కు చేరింది. దవాఖానపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతుండడంతో అక్టోబర్ నెలలో 137 కాన్పులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతోపాటు నెలలో ఓపీల సంఖ్య 2వేలు ఉండగా, ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నది. ఆగస్టులో 10,011 మంది రోగులకు పరీక్షలు నిర్వహించగా, సెప్టెంబర్‌లో 13,832 మందికి వైద్య సేవలు అందించారు. అక్టోబర్‌లో ఎన్నడూ లేనివిధంగా 14,851 మంది ఇక్కడ వైద్య సేవలు పొందారు. అత్యవసర, అతిక్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే గర్భిణులకు సిజేరియన్ చేస్తుండగా, వీలైనంత వరకూ సహజ కాన్పులను చేయిస్తున్నారు. మహిళల ఆరోగ్యం దెబ్బతినకుండా ఇక్కడి వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటూ, అందరి ప్రశంసలు పొందుతున్నారు. వీలైనంత మేరకు సహజ కాన్పులకే ప్రాధాన్యం ఇస్తుండగా, ఇక్కడికి వచ్చే వచ్చే గర్భిణులతో యోగా, ఇతారాత్ర వ్యాయామాలు చేయిస్తున్నారు.


42 సాధారణ కాన్పులు..
గత నెలలో ఇక్కడ 137 ప్రసవాలు చేయగా, అందులో 42 సాధారణ కాన్పులు అయినట్లు దవాఖాన సూపరిండెంటెంట్ రవిప్రవీణ్‌రెడ్డి తెలిపారు. 39 అత్యంత క్లిష్టమైన కాన్పులు చేశామని పేర్కొన్నారు. థైరాయిడ్, డెంగీతో భాదపడుతున్న గర్భిణులకూ కాన్పులు చేసినట్లు వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన కాన్పులు చేయడంలో హుజూరాబాద్ సర్కార్ దవాఖానకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందనీ, గత మూడు నెలల్లో ఇక్కడి నుంచి ఒ క్కరిని కూడా ఇతర దవాఖానలకు పంపిచలేదని తెలిపారు. స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ లీలా, వా ణిలత ఆధ్వర్యంలో గర్భిణులకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి ఆ ధ్వర్యంలో అతిక్లిష్టమైన అపరేషన్లు చేస్తున్నామని చెప్పారు. వైద్యులు లావణ్య, శ్రీనివాస్, మహిపా ల్, సురంజన్, రమేశ్, రాజు తమ తమ పరిధిలో ఉన్నత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

50

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles