భాగ్యలక్ష్మి భర్త కృష్ణమార్తికి ఎల్వోసీ పత్రాన్ని అందజేస్తున్న నాయకులు


Sat,November 2, 2019 01:43 AM

-రూ.3లక్షలకు ఎల్‌వోసీ అందజేత
ముస్తాబాద్: మండల కేంద్రానికి చెందిన గందె భాగ్యలక్ష్మి ఎర్నియా వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చేరారు. వై ద్యులు ఆమెను పరీక్షించి చికిత్సకు ఐదు లక్షల వరకు ఖర్చవుతాయని తెలి పారు. దీంతో ఆర్థిక స్థోమత అంతగాలేని ఆమె దిక్కుతోచని స్థితిలో పడి పోయింది. ఈ క్రమంలో భాగ్యలక్ష్మి కుటుంబీకులు స్థానిక టీఆర్‌ఎస్ నాయకులను అశ్రయించారు. వారు విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ల గా, ఆయన వెంటనే స్పందించి రూ.3 లక్షలకు లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను మం జూరు చేయించి అండగా నిలిచారు. సంబంధిత చెక్కును భాగ్యలక్ష్మి భర్త కృష్ణమూర్తికి ముస్తాబాద్ పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్‌రావు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా కోరిన వెంటనే అండ గా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు బాధితురాలి కుటుంబీకులు, మండల టీఆర్‌ఎస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సుమతి, తన్నీరు గౌతంరావు, పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, పట్టణాధ్యక్షుడు భరత్, సంతోష్‌రావు, సాదుల్‌పాపా, నర్సయ్య, రాజిరెడ్డి, నర్సింహ్మరెడ్డి, స్వామి, అన్వర్, నాయకులు పాల్గొన్నారు.


బండలింగంపల్లి గ్రామస్తురాలికి రూ.లక్ష..
ఎల్లారెడ్డిపేట: బండలింగంపల్లికి చెందిన జంగ వెంకటలక్ష్మి కొంత కాలంగా అన్నవాహిక క్యాన్సర్‌తో బాధపడుతున్నది. శస్త్ర చికిత్సకు రూ.6లక్ష లు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో బాధితురాలి బంధు వు, గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ఉపసర్పంచ్ ఆరుట్ల అంజిరెడ్డి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అమాత్యుడు వెంటనే స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.లక్షకు ఎల్‌వోసీ మంజూరు చే యిం చారు. ఆపద కాలంలో ఆదుకున్న అమాత్యుడికి బాధితురాలి కు టుంబీ కులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

48

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles