జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి


Sat,November 2, 2019 01:42 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాను అభివృద్ధి బాటలో నడపాలనీ, దీనికి నాయకులతో పాటు అధికారులు కృషి చేయాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం స్థాయీ సంఘాల స భ్యులతో సమావేశం నిర్వహించారు. ఎ మ్మెల్యే సంజయ్‌కుమార్‌తో పాటు, జడ్పీలో వివిధ స్థాయి సంఘాల సభ్యు లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చూపిన దారిలో జిల్లాను అభివృద్ధి బాటలో నడిపేందుకు ప్రజాప్రతినిధులు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. అభివృద్ధిలో మిగతా రాష్ట్రంలో నే ముందు వరుసలో నిలుపాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజల ఆరోగ్యంపై వైద్య, ఆరో గ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుత సీజన్‌లో జ్వరాలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎ దుర్కొన్నారనీ, గ్రామాల్లో రోగాలు రా కుండా వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. కార్యాలయంలో వైద్య, విద్య సే వల స్థాయి కమిటీ సమవేశాన్ని నిర్వహించారు. అనంతరం విద్య, వైద్యం, వయోజన తదితర శాఖల అధికారులు, స్థాయి సంఘానికి నివేదికలు సమర్పించారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles