ఉమ్మడి జిల్లాస్థాయి ఖోఖో పోటీలకు జట్ల ఎంపిక


Sat,November 2, 2019 01:42 AM

కరీంనగర్ స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాకలో నవంబర్ 4 నుంచి జరుగనున్న ఉమ్మడి జిల్లా అండర్-17 ఖోఖో పోటీల్లో పాల్గొనే కరీంనగర్ బాల బాలికల జట్లను ఎస్జీఎఫ్ కార్యదర్శి కె సమ్మయ్య శుక్రవారం ప్రకటించారు. బాలుర జట్టులో ఎ రాహుల్, కె రాజు, ఎం రవి వర్మ, ఈ సాయిహరి, కె శేఖర్, ఎం అజయ్‌కృష్ణ, ఆర్ అభి, వై రవిచరణ్, జీ నాని, కె సాయిరాం, గౌతమ్, ఎండీ కైఫ్ ఉన్నారు. బాలికల జట్టుకు ఎస్ స్రవంతి, జీఅఖిల, కె అంజలి, ఎల్ దివ్య, సీహెచ్ తేజశ్రీ, జి సంధ్య, బి రసజ్ఞ, ఎస్ సహశ్రీ, జి శివాని, సీహెచ్ అఖిల, ఎం కీర్తన, పి సౌజన్య పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులు 4న ఉదయం కరీంనగర్‌లోని అంబేద్కర్‌స్టేడియంలో టీమ్ కోచ్, మేనేజర్లు ఎం సామిరెడ్డి, ఇవి శ్రీలతను ధ్రువీకరణపత్రాలతో సంప్రదించాలని సూచించారు.

32

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles