హిమ్మత్‌రావుపేటకు అవార్డుల పంట


Wed,October 23, 2019 01:59 AM

కొడిమ్యాల: గ్రామాన్ని వంద శాతం అభివృద్ధి పరుచుకొని ఆదర్శంగా నిలవాలనుకున్నారు హిమ్మత్‌రావుపేట గ్రామస్తులు. వంద శాతం ప్రభుత్వ పథకాలను అమలు ప రుచుకుంటూ ముందుకెళ్తున్నారు. 415 కుటుంబాలు ఉండ గా పరిశుభ్రతకు అందరూ కృషి చేస్తున్నారు.


వంద శాతం ఇంకుడు గుంతలు
గ్రామంలో 415 కుటుంబాలకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. ప్రతి ఇంట్లో సిలిండర్‌ వాడడంతో అడవుల నుంచి వంట చెరుకు ( కట్టెలను ) నరకడం మానేశారు. భూ గర్భ జలాలు పెరుగుతున్నాయి. అడవులను సంరక్షిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లను పెంచడంతో పాటు వాటికి నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు. వంద శాతం మరుగుదొడ్లు ని ర్మించుకోవడంతోపాటు గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా శ్రమదాన కార్యక్రమాలు చేస్తున్నారు. 2013-14వ సంవత్సరంలో 26 వేల మొక్కలను నాటి రోడ్డుకు ఇరువైపులా, పొలం గట్ల వద్ద మొక్కలు పెంచుతున్నారు. గ్రామ పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల వద్ద శ్మశాన వాటిక వద్ద, మహిళ సంఘ భవనం, కుల సంఘాల భవనాల వద్ద మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను నిర్మించడంతోపాటు పూల మొక్కలను నాటా రు. మొక్కలను సంరక్షించేందుకు పైపు కంపోస్టు ఎరువుల తయారీని పైపుల ద్వారా ఏర్పాటు చేశారు.

పూల కుండీల ఏర్పాటు
గ్రామ ప్రస్తుత సర్పంచ్‌ పునుగోటి కృష్ణారావు సహకారంతో గ్రామంలోని ప్రధాన వీదుల్లో పూల కుండీలను ఏ ర్పాటు చేసి రకరకాల పూల మొక్కలను పెంచుతున్నారు. గ్రామ శివారులో నాలుగెకరాల భూమిలో కోతుల కోసం రకరకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. ప్రత్యేకంగా వాటి కోసం నీళ్ల ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. ఎరువులను వేస్తూ వాటిని సంరక్షిస్తున్నారు. 90 శాతం సీసీ రోడ్లు, చెత్త వేసేందుకు డంపింగ్‌ యార్డు, రైతు లు వరి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు 40 లక్షలతో గోదాం నిర్మించారు. శ్మశాన వాటిక నిర్మించారు.

ప్లాస్టిక్‌ను వాడకుండా తీర్మానం
గ్రామంలో ఎవరూ ప్లాస్టిక్‌ను వాడకుండా పంచాయతీ కార్యాలయంలో తీర్మానం చేశారు. పాస్టిక్‌ను వాడకుండా జ్యూట్‌ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి పండ్లు, పూల మొక్కలను పం పిణీ చేశారు. తడి, పొడి చెత్త బుట్టలను అందించడంతో పాటు గ్రామ కూడళ్లలో చెత్త కుండీలను ఏ ర్పాటు చేశారు. చెత్తను తరలించేందుకు బ్యాటరీతో నడిచే ఆటోను కొనుగోలు చేశారు. 30 రో జుల పనులను పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ చేతుల మీదుగా గ్రామ స్తులకు జ్యూట్‌ బ్యాగులను పంపిణీ చేశారు. ఇటీవలే అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సైతం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధ్దిపై ప్రశంసించారు.

గ్రామానికి అవార్డులు
హిమ్మత్‌రావుపేట గ్రామానికి 2003లో జలమిత్ర అవా ర్డు అందుకోగా 2007లో నిర్మల్‌పురస్కార్‌, 2017లో హ రిత మిత్ర అవార్డు, 2018లో స్వచ్ఛభారత్‌ అవార్డు అందుకున్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆక్టోబర్‌ 5న రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేతుల మీదుగా జగిత్యాలలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు గ్రామ కైవ సం చేసుకుంది. 150 గాంధీ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమంలో స్వచ్ఛభారత్‌ ద్వారా గ్రామ పంచాయతీకి ప్రధాని చేతుల మీదుగా సర్టిఫికెట్‌ ప్రదానం చేశారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి సదస్సులో నేషనల్‌ పంచాయతీ 2019 అవార్డును గ్రామ సర్పంచ్‌ పునుగోటి కృష్ణారావు అందుకోబోతున్నారు.

గ్రామస్తుల సహకారంతో సాధ్యమైంది
గ్రామస్తులు అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దడం సాధ్యమైంది. గ్రామంలో ఏ పని మొదలు పెట్టాలన్నా గ్రామస్తులందరం సమావేశం ని ర్వహించి ఐక్యతతో పనులు ప్రారంభిస్తాం. సహకారాలు మరువలేనివి. గ్రా మంలో మరిన్ని అభివృద్ధ్ది పనులు నిర్వహిం చి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తాం.
పునుగోటి కృష్ణారావు, సర్పంచ్‌, హిమ్మత్‌రావుపేట

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles