పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి


Mon,October 21, 2019 12:58 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ : ధర్మపురి పట్టణాభివృద్ధి మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టి సారించారని మాజీ వైస్ ఎంపీపీ, ఎన్నికల సమన్వయ కర్త అయ్యోరి రాజేశ్‌కుమార్ అన్నారు. ఆదివారం ధర్మపురి పురపాలక సంఘ పరిధిలోని 1, 4, 7, 13 వార్డుల టీఆర్‌ఎస్ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఎవరికి దక్కిన పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. గత ఐదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని మంత్రి రూ.1300 కోట్లతో అభివృద్ధి చేశారనీ, ఇందులో ధర్మపురి పట్టణానికే రూ.280 కోట్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడపగడపకూ వివరించాలని సూచించారు. లక్ష్మీనారసింహుడి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో రూ.50కోట్లు కేటాయించేలా చూడడంతో పాటు సీఎం కేసీఆర్ పట్టణ పర్యటనలో మరో రూ.50కోట్లు ప్రకటించారని చెప్పారు.


మేజర్ పంచాయతీగా ఉన్న ధర్మపురి మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ చేయించి అభివృద్ధి రూ.25కోట్లు మంజూరు ఇప్పిచండంతో పాటు గోదావరి నదిలో మురుగు నీరు కలువకుండా మహా డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.68కోట్లతో పనులు ప్రారంభించారన్నారు. పట్టణంలో మురికి కూపంలా మా రిన చింతామణి చెరువును రూ.1.30కోట్లతో సుం దరీకరించామనీ, తమ్మళ్లకుంటను సైతం రూ.63 లక్షలతో అందంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. బోల్‌చెరువు ఆధునికీకరణతో పాటు పా టు, బందం మాటు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వీటితో పాటు మరిన్ని అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయనీ, వాటిని ప్రజలకు వివరించాలని సూచించా రు. సమావేశంలో నాయకులు కూరగాయల సం తోష్, అలీమ్, శంకర్‌రాజు, డీజే మహేశ్, రవిచందర్, శీలం రమేశ్, జగదీశ్, సురేష్ పాల్గొన్నారు.

64

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles