అంజన్న సన్నిధిలో 25న టెండర్లు


Mon,October 21, 2019 12:58 AM

మల్యాల : కొండగట్టు అంజన్న సన్నిధానంలో పలు దుకాణాల నిర్వాహణకు గానూ ఈ నెల 25న ఈ టెండర్, షీల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కాల పరిమితితో భక్తులు కొట్టిన కొబ్బరికాయలను సేకరించుకునే లైసెన్సు హక్కుతో పాటు శీతల పానియా లు, ఐస్‌క్రీం అమ్ముకునేందుకు హక్కులు, లాకర్ రూం నిర్వాహణ, కొండగట్టు ఆల య పరిధిలో ఫొటోస్టూడియో నడుపుకునేందుకు హక్కుల నిర్వాహణ, స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్వాహణకు, గుట్ట కింద గల దుకాణ సముదాయం నంబర్ 1, 6, 7, 8, 9, 10లో పలు దుకాణాలను లీజు రూపంలో పొందేందుకు వేలం పాట లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు దరావత్తు సొమ్ముతో పాటు సెక్యూరిటీ డిపాజిట్, షెడ్యూల్‌ను పొందుపరచాల్సి ఉంటుందన్నారు. ఏదేని జాతీయ బ్యాంకు నుంచి దరావత్తు సొమ్మును కార్యనిర్వాహణ అధికారి ఆంజనేయస్వామి వా రి దేవస్థానం పేరిట డీడీలను తీసి సమర్పించాలని తెలిపారు. ఆసక్తి గల వారు కార్యాలయ పనివేళల్లో నేరుగా గానీ, సెల్ నంబర్ 9491000653, 9848778154 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

64

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles