22న ఉమ్మడి జిల్లా హకీ జట్ల ఎంపికలు


Mon,October 21, 2019 12:57 AM

కరీంనగర్ స్పోర్ట్స్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 22న ఉమ్మడి జిల్లా హాకీ బాల బాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె సమ్మయ్య పేర్కొన్నారు. పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) అండర్-14, 17 విభాగంలో బాలికల జట్టు, అండర్-14 విభాగంలో బాలుర జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఎలిజిబిలిటీ ఫామ్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలతో 22న ఉదయం 9 గంటలకు హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాలలో రిపోర్టు చేయాలన్నారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles