చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి:ఎస్‌ఐ


Sat,October 19, 2019 01:48 AM

పెగడపల్లి : విద్యార్థులు చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలనీ, దీంతో భవిష్యత్‌లో ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారని ఎస్‌ఐ బలిజపల్లి జీవన్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, సన్మార్గంలో నడుస్తూ జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు చట్టాలు, ఆయుధాల పనితీరు, కేసుల నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంపై అవగాహన కల్పించారు. ఏఎస్‌ఐ కుందేళ్ల పోచయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles