విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన


Sat,October 19, 2019 01:48 AM

పెగడపల్లి : మండలం ఆరవల్లి గ్రామంలో విద్యుత్ ప్రమాదాల నివారణపై ట్రాన్స్‌కో సిబ్బం ది రైతులకు అవగాహన కల్పించారు. రైతులు వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ మోటర్లు స్టార్ట్, ఆఫ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరించారు. వర్షం కురిసే సమయంలో విద్యుత్ మోటర్లు ఆన్, ఆఫ్ చేయడం, స్థంబాల ఎర్త్ వైర్‌ను ముట్టకోవద్దని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూ జులు పోయినా, వైర్లు తెగిపోయినా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన కర పత్రాలను రైతులకు పంపిణీ చేశారు. సర్పంచ్ ఉప్పలంచ లక్ష్మణ్, సబ్ ఇంజినీర్ హరీశ్ ఉన్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles