హరితహారానికి ప్రాధాన్యమివ్వాలి


Fri,October 18, 2019 01:22 AM

-కొత్త చట్టానికి అనుగుణంగా మొక్కలను కాపాడుకోవాలి
-నాటిన వాటిలో 85 శాతం బతికించుకోవాలి
-ప్రతి గ్రామంలోనూ డస్ట్‌బిన్‌లు ఇవ్వాలి
-ఇంటింటికీ చెత్త సేకరించాలి
-పల్లెల్లో ఎల్‌ఈడీ లైట్లను అమర్చాలి
-వైకుంఠధామాల పురోగతి తెలియజేయాలి
-డంప్‌యార్డులకు స్థలాల కేటాయింపు
-అధికారులకు కలెక్టర్ శరత్ ఆదేశం
-30రోజుల ప్రణాళికపై సమీక్ష
-నూకపెల్లిలో డబుల్‌బెడ్ రూం ఇండ్ల పరిశీలన
జగిత్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలనీ, కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా నాటిన వందశాతం మొక్కల్లో 85 శాతం కాపాడుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ ఆదేశించారు. 30 రోజుల గ్రామ ప్రణాళికపై గురువారం ఐఎంఏ హాలులో జిల్లా స్థాయి అధికారులు, ప్రత్యేకాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో రోడ్‌సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్, మంకీఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలనీ, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నాటిన మొక్కలు 85 బతికించుకోవాలన్నారు. వాచ్ అండ్ వార్డ్ చేసే వారికి ఐడీ కార్డు జారీ చేయాలనీ, అందులో ఏ ఏరియా?, మొక్కలు ఎన్ని?, పేరు, గ్రామంతో కార్యదర్శి సంతకం చేసి ఉండాలని చెప్పారు. ప్రతి పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేసుకోవాలనీ, డిమాండ్ సర్వే చేసి అవసరమైన మొక్కలతోపాటు శ్రీగంధం మొక్కలు పెంచాలన్నారు. ఇవన్నీ ఈజీఎస్ సిబ్బందిచే పనులు చేయించాలని చెప్పారు. సోక్‌పిట్స్, కమ్యూనిటీ సోక్‌పిట్స్, నర్సరీ ప్లాంటేషన్‌కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇవ్వాలన్నారు. ప్రతి పంచాయతీలో ఇంటింటికీ డస్ట్‌బిన్‌లు ఇవ్వాలనీ, తీసుకున్న వారు వాటిని వాడుతున్నారా? లేదా? అని పరిశీలించాలని సూచించారు.


గతంలో జిల్లాలో 1.80 లక్షల కుటుంబాలకు డస్ట్‌బిన్‌లు ఇచ్చామనీ, అందని వారికి మళ్లీ ఇవ్వాలని ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరించాలనీ, గ్రామంలోని కార్యదర్శి ఏ వార్డును దత్తత తీసుకున్నారో? అవి కూడా యాక్షన్‌ప్లాన్‌లో ఉండాలని స్పష్టం చేశారు. ప్రధాన కూడళ్లలో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలనీ, చెత్త విసర్జన కేంద్రం, వైకుంఠధామాల పురోగతిని తెలియజేయాలన్నారు. 65 ఏళ్లు దాటిన వర్కర్ల స్థానంలో వారి అంగీకారంతో వారి కుటుంబ సభ్యుల్లో మరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. వర్కర్లు ఎంతమంది ఉన్నారు?, ఒక్కో వర్కర్‌కు ఎన్ని వార్డులు వస్తాయో? వార్డు ప్రారంభం ముందు సైన్‌బోర్డు ఏర్పాటు చేసి, పేరు, సెల్ నెంబర్ రాయించాలని చెప్పారు. ప్రతి గ్రామానికీ ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్, దోమల మిషన్ కొనుగోలు చేసుకోవాలనీ, గ్రామంలోని వీధి లైట్లకు మీటర్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో వీధిలైట్లకు ఎల్‌ఈడీలు అమర్చాలనీ, గ్రామాల్లో ఉన్న కొత్త, పాత ట్యాంకులకు మిషన్ భగీరథ నీరు ఇస్తున్నందున బోరు నీరు ఆపేయాలన్నారు. అప్పుడు విద్యుత్ బిల్లులు తగ్గుతాయన్నారు. విద్యుత్తు బిల్లులు బకాయిలు లేకుండా చూడాలన్నారు.

వార్షిక ప్రణాళికలో పేర్కొన్న పనులను గ్రామ సభలో ఆమోదం పొంది అవే పనులు అమలు చేయాలన్నారు. 30 రోజుల ప్రణాళికలో ప్రతి గ్రామంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మండల కేంద్రానికి తరలించాలని సూచించారు. చెత్త బయటవేసినా, బహిరంగ మల విసర్జన చేసినా జరిమానా వేయాలని గ్రామసభల్లో తీర్మానించారనీ, దాన్ని యథాతథంగా కొనసాగించాలనీ, 30 రోజుల ప్రణాళికల్లో వేసిన విధంగానే ఆగకుండా పరిశుభ్రత పాటించేలా చూడాలని అన్నారు. గొల్లపల్లి, బీర్పూర్, ధర్మపురి మండలాల ఇన్‌చార్జి గత మూడు నెలలుగా ఏ మండలంలో విధులు నిర్వహించడం లేదని సారంగాపూర్ మండల ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సాయికుమార్ తెలుపడంతో ఆ ఇన్‌చార్జిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం అధికారిపై విచారణ జరిపేందుకు జడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీలతారెడ్డిని నియమించి, ఆదేశించారు. ఈ సమీక్షలో జడ్పీ సీఈవో ఏ శ్రీనివాస్, డీపీవెవో శేఖర్, ఎంపీడీఓలు, మండల, గ్రామ ప్రత్యేకాధికారులు, పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్ల పరిశీలన..
జిల్లా కేంద్రంలోని నూకపెల్లి అర్బన్ కాలనీలో ఫేస్- 1కింద నిర్మించిన 160డబుల్ బెడ్‌రూం ఇండ్లను కలెక్టర్ శరత్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొత్తం 160ఇండ్లను ఒక్కో ఇంటికి 5.30 లక్షల చొప్పున 8.48కోట్లతో హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజ్ కన్‌స్ట్రక్షన్ నిర్మించిందని తెలిపారు. సెప్టిక్ ట్యాంకు, సీవరేజ్ పైప్‌లైన్లు, వ్యక్తిగత వాటర్ ట్యాంకుల నిర్మించేందుకు 15లక్షలు అవసరమవుతాయని చెప్పిన ఆయన, ఈ నిధులను జగిత్యాల అభివృద్ధి పథకంలోంచి మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ రాజ్ ఈఈ మనోహర్ రెడ్డి, ఆర్డీవో నరేందర్‌కు సూచించారు. త్వరితగతిన ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులను అందజేయాలని ఆర్డీవోను ఆదేశించారు. కాంట్రాక్టర్ నూతన ఇండ్లను పంచాయతీ రాజ్ ఈఈకి అప్పగిస్తే, మున్సిపల్ కమిషనర్, ఈఈపీఆర్ భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఈఈ రాజేశ్వర్, అర్బన్ తాసిల్దార్ వెంకటేశ్, మల్యాల తాసిల్దార్ శ్రీనివా స్, కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
మసీద్, దర్గాల అభివృద్ధి పనులపై..
జగిత్యాల రూరల్ : మసీద్, గ్రీవ్‌యార్డు, దర్గా ల అభివృద్ధి పనులపై కలెక్టర్ శరత్ గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిధులు మంజూరైన వాటిని వెంటనే పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఈఈని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినప్పటికీ నిధులు మంజూరు కావాల్సిన పనులకు మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్‌కు ప్ర తిపాదనలు పంపి నిధులు పొందాలని జిల్లా మై నార్టీ సంక్షేమాధికారి సుందర వరద రాజన్‌ను ఆ దేశించారు. డిప్యూటీ ఈఈలు రహెమాన్, గోపాల్, డీఎండబ్ల్ల్యూవో శాఖ నుంచి మహమూ ద్ అలీ, ధరణి తదితరులు పాల్గొన్నారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles