కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట


Fri,October 18, 2019 01:19 AM

చొప్పదండి,నమస్తేతెలంగాణ: రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్ కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్మకుర్మపల్లిలో రూ.9.20 లక్షలతో యాదవసంఘం, 5.20లక్షలతో కుర్మ సంఘం భవన నిర్మాణ పనులను ఆ యన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మాదని అన్నా రు. ప్రజల శేయస్సే ధ్యేయంగా రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటి కీ చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చా రు. గ్రామాలలో చేపడుతున్న కమ్యూనిటీ భవన నిర్మాణాలను అత్యంత సుందరంగా నాణ్యతతో చేయించాలనీ, కమ్యూనిటీ భవనాలను చిన్న చిన్న శుభకార్యాలు చేసుకునేవిధంగా నిర్మాణం చేయాలని సూచించారు.


అనంతరం రోడ్డుప్రమాదంలో గాయపడిన గీత కార్మికుడు బొడిగె పోచయ్యను ఎమ్మెల్యే పరామర్శించి అతని ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవి, సర్పంచ్ తొట్ల గంగ మల్లయ్య, ఎంపీటీసీ కూకట్ల తిరుపతి, కోఆప్షన్ పాషా, ఉప సర్పంచ్ దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బందారపు అజయ్, నాయకులు గడ్డం చు క్కారెడ్డి, తొట్ల తిరుపతి,తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్,వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, మాచర్ల వినయ్, కడారి అంజ య్య, కూకట్ల రాజు, అశోక్, కడా రి మల్లయ్య, బైర కనుకయ్య, అమ్ముల కొమురయ్య, నంగి ఐలయ్య, కూకట్ల భూమయ్య, భీరయ్య, తొట్ల రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles