మెడికవర్‌లో అరుదైన న్యూరో సర్జరీ


Fri,October 18, 2019 01:19 AM

కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ మెడికవర్ దవాఖానలో అరుదైన న్యూరోసర్జరీ నిర్వహించి ప్రమాదంలో నుజ్జునుజ్జయిన 8 ఏళ్ల బాలుడి తలకు పూర్వస్థితి తీసుకువచ్చినట్లు దవాఖాన న్యూరో సర్జన్ డాక్టర్ పీవీకే కిశోర్ తెలిపారు. గురువారం దవా ఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా నమిలికొండకు చెందిన మ ల్యాల పర్శరామ్ కుమారుడు రిషికుమార్ ఈనెల 5న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదేరోజు బాలున్ని మెడికవర్ దవాఖాన తీసుకురాగా స్కా నింగ్ చేసి ప్రమాదస్థితి, బాలుడి కండీషన్‌ను పరీక్షించారు.


అప్పటికే తలకు తీవ్రగాయం కావడంతో స్పృహ కోల్పోయి ఉన్నాడు. తల కుడివైపు భా గంలో నుజ్జునుజ్జయింది. ఎముకలు తలలోనికి దిగబడ్డాయి. ఒక రంధ్రం ఏర్పడి మెదడు సైతం బయటికి వచ్చింది. బాలుడి ప్రా ణాలు కాపాడేందుకు వెంటనే ప్రైమరీ క్రాని యోప్లాస్టి ఆపరేషన్ ప్రారంభించి టైటానియమ్ మెష్ ద్వారా బాలుడి తలకు పూర్వస్థితి తీసుకురావడంలో విజయవంతం అయినట్లు తెలిపారు. 24గంటలు న్యూరో సేవలు అందించడం, యూ రోపియన్ టెక్నాలజీతో తయారైన మిషనరీ అం దుబాటులో ఉండడంతో ఈ ఆపరేషన్‌ను సులభంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అనస్థీషియా వైద్యులు డాక్టర్ వినయ్, డాక్టర్ మహేశ్, దవాఖాన అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles