రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక


Fri,October 18, 2019 01:18 AM

కరీంనగర్ స్పోర్ట్స్: హైదరాబాద్‌లో ఈ నెల 18 నుంచి 20 వరకు జరుగనున్న 65వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు నగరంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్-14, 17 బాల బాలికల విభాగంలో జరిగే ఈ పోటీలకు అల్ఫోర్స్ విద్యా సంస్థలకు చెందిన ఏ హన్సిక, ఫాతిమా, వై. అస్మిత, ఎం. ఆదర్శ్, కే భరత్‌రాజ్, సుహాని, కే శ్రీకరి, ఏ హరిచందన, వీ సరయు, జీ సంతోషిని, డీ అక్షిత్‌సాయి ఎంపికైనట్లు యాజమాన్యం తెలిపింది. వీరిని గురువారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అభినందించారు. అలాగే, రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు పారమిత పాఠశాలకు చెందిన విద్యార్థిని సంయమి ఎంపికైనట్లు హెచ్ ఎం కే హన్మంతరావు పేర్కొన్నారు. విద్యార్థినిని అధినేత డాక్టర్ ఈ ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్‌రావు, వినోద్‌రావు, రశ్మిత, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద్ కమలాకర్, పీఈటీ ఎల్లయ్య అభినందించారు.

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles