నేరాల అదుపునకు నేనుసైతం


Fri,October 18, 2019 01:18 AM

ఎల్లారెడ్డిపేట: నేరాల అదు పు చేయడమే నేను సైతం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఎస్పీ రాహుల్‌హెగ్డే అ న్నారు. గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేను సైతం కార్యక్రమంలో భా గం గా సర్పంచ్ సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డి, దాతలతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాల దాతలు సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ రాధారపు సత్యం చెరో రూ.లక్ష, అశ్విని హాస్పిటల్ వైద్యులు సత్యనారాయణస్వామి రూ.95 వేలు, బొమ్మకంటి భాస్కర్, పంచాయతీ కోఆప్షన్ సభ్యు లు బొమ్మకంటి అశోక్ చెరో 20వేలు, బుస్స గంగాధర్, బొమ్మకంటి అశోక్ చెరో రూ.పదివేలు, వ్యాపారస్థులు తమకు తోచిన విధంగా సాయం అందించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినందుకు అభినందించారు. తనది కాదనే భావన ఏర్పడినప్పుడు బాధ్యతారాహిత్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిపౌరుడూ యూనిఫారంలేని పోలీసేనని భా వించినప్పుడే బాధ్యత పెరుగుతుందని అన్నారు. అపరిచిత వ్యక్తులను ఆరాతీసేవా రు లేకుండా పోయారని అందుకే సీసీ కెమెరాల అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇటీవల బొప్పాపూర్ చైన్‌స్నాచింగ్ కేసును ఛేదించడంలో సీసీ కెమెరాలదే ప్రధానమైన పాత్ర అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, సీఐ కే.రవీందర్, ఎస్‌ఐ అనిల్, దాతలు, గ్రామస్తులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles