బల్దియాలను పరిశుభ్రంగా మార్చాలి


Thu,October 17, 2019 01:32 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలోని 5 మున్సిపాలిటీలను పరిశుభ్రంగా మార్చాలని త్రుక్టర్ శరత్ సూచించారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీలను పరిశుభ్రంగా మార్చడంపై కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శరత్ మున్సిపల్ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 30 రోజల గ్రామ ప్రణాళిక నిర్వహించిన మాదిరిగానే జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ప్రణాళిక తయారు చేసి వార్డుల వారీగా ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించడం, మురుగు కాలువలు ఎన్ని మీటర్లు, వార్డులను పరిశుభ్రం చేసేందుకు వార్డుల వారీగా ప్ర ణాళికను తయారు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో డంపింగ్‌యార్డు, వైకుంఠదామం, నర్స రీ పెంచేందుకు స్థలాలను ఏర్పాటు చేసుకుని ప్రతి మున్సిపాలిటీలకు కావాల్సిన మొక్కలను నర్సరీల్లో పెంచాలన్నారు.


తడి చెత్తకు, పొడి చెత్తకు డబ్యాలు ఇవ్వాలనీ, చెత్త సేకరించే ఆటోలపై స్వ చ్ఛ లోగోలు ఏర్పాటు చేయాలన్నారు. పరిధిలోని రోడ్లకు రోడ్‌సైడ్ ప్లాంటేషన్ ఏర్పా టు చేసుకోవాలనీ, వచ్చే సంవత్సరానికి డిమాండ్ సర్వే నిర్వహించి నర్సరీల్లో వారికి కావాల్సిన మొ క్కలతోపాటు శ్రీగంధం మొక్కలను కూడా పెంచాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేయాలనీ, అదే విధంగా దోమల మిషన్లు అవసరాలను బట్టి పెద్ద గ్రామ పంచాయతీకి రెం డు, చిన్న గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున కొనుగోలు చేయాలనీ, నాటిన మొక్కలను బతికే లా అన్ని చర్యలను చేపట్టాలనీ, బాధ్యతాయుతం గా పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం, సబ్ కలెక్టర్ గౌ తం పోట్రూ, జడ్పీ సీఈఓ శ్రీనివాస్, డీఆర్వో అరుణశ్రీ, ఆర్డీఓ నరేందర్, డీపీఓ శేఖర్, 5 ము న్సిపాలిటీల కమిషనర్లు, 30 రోజుల గ్రామ ప్రణాళిక ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

పెట్రోల్ బంక్ అధికారులతో సమీక్ష..
కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరం లో బుధవారం పెట్రోల్ బంకు యాజమానులతో కలెక్టర్ శరత్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జిల్లాలోని అన్ని పె ట్రోల్ బంకులలో టాయిలెట్సు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా తప్పక ఏర్పాటు చేయాలన్నారు. టా యిలెట్స్ లేకుంటే బంకులను సీజ్ చేస్తామన్నారు. తాళాలు వేసి ఉంచరాదని, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళకుండా టాయిలెట్స్‌లను ఉపయోగించేలా సైన్‌బోర్డులు పెట్టాలన్నారు. పెట్రోల్ బంకులకు వచ్చే దారిలో పెట్రోల్ పంపు బోర్డు కింద ఉచిత మరుగుదొడ్లు కలవనే సైన్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మరుగుదొడ్లకు స్వచ్ఛ సర్వేక్షణ్ గు ర్తులు పెట్టాలన్నారు. జిల్లాలో అన్నీ ఒకే రంగుల్లో ఒకే విధంగా ఉండేలా చూడాలనీ, జిల్లా పౌరసరఫరా అధికారులు పెట్రోల్ బంకులలో టాయిలె ట్స్ ఏర్పాటుపై తనిఖీ చేసి ఫొటోలతో సహా నివేదికను సమర్పించాలన్నారు.

మరుగుదొడ్లు లేని పెట్రోల్ బంకు యాజమానులు ఐదు రోజుల్లో ఒకటి, 30వ తేదీలోగా రెండో మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాలన్నారు. జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్స్ కోసం స్థలా న్ని ప్రభుత్వం నుంచి కేటాయిస్తామనీ, పెట్రోల్ పంపు అసోసియేషన్ ద్వారా 5 మున్సిపాలిటీల లో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు అంగీకరించిన ట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పబ్లిక్ టాయిలెట్స్‌కు వి ద్యుత్, నీరు, స్థలం జిల్లా యంత్రాంగం కేటాయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ బీ రాజేశం, మెట్‌పల్లి సబ్ కలెక్టర్ గౌతం పోట్రూ, ఆర్డీఓ నరేందర్, పౌరసరఫరాల అధికారి, పెట్రోల్ బంకు యాజమానులు పాల్గొన్నారు.

70

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles