హోరాహోరీగా హాకీ పోటీలు


Thu,October 17, 2019 01:31 AM

ఎదులాపురం: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 65వ రాష్ట్రస్థాయి హాకీ పోటీలు బుధవారం రెండో రోజు హోరాహోరీగా జరుగుతున్నాయి. లీగ్ కం నాక్ అవుట్ పద్ధతిలో జరుగుతున్న హాకీ పోటీల్లో మొదటగా ఆదిలాబాద్ , ఖమ్మం జట్లు తలపడ్డాయి. ఖమ్మంపై ఆదిలాబాద్ జట్టు 8-0 గోల్స్‌తో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో నిజామాబాద్, మెదక్ తలపడగా రెండు జట్టు 2-2 గోల్స్ సాధించగా డ్రా జరిగింది. మూడో మ్యాచ్‌లో వరంగల్- హై దరాబాద్ తలపడగా , హైదరాబాద్‌పై వరంగల్ 8-0 తో విజయం సాధించింది. 4వ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్- కరీంనగర్ నడుమ జరగగా, 8-0 తో మహబూబ్‌నగర్ విజయం సాధించిం ది. 5వ మ్యాచ్ నిజామాబాద్- రంగారెడ్డి జట్ల మధ్య జరగగా నిజామాబాద్ 1, రంగారెడ్డి 2 గోల్స్ చేశాయి. 6వ మ్యాచ్ హైదరాబాద్- మెదక్ జట్ల నడుమ జరగగా హైదరాబాద్‌పై మెదక్ 0-11తో విజయం సాధించింది. 7 వ మ్యాచ్‌లో నిజామాబాద్- వరంగల్ జట్ల నడుమ ఉండగా చెరొక్క గోల్‌తో 1-1 తో డ్రా అయింది. 8 వ మ్యాచ్ ఖమ్మం- కరీంనగర్ నడుమ ఉండగా , 2-0తో ఖమ్మం విజయం సాధించింది. 9వ మ్యా చ్‌లో రంగారెడ్డి- మెదక్‌లు తలపడగా మెదక్ 2, రంగారెడ్డి ఒక గోల్ సాధించగా మెదక్ జట్టు విజయం సాధించింది. పదో మ్యాచ్‌లో ఆదిలాబాద్ -మహాబూబ్‌నగర్ జట్లు పోటీ పడగా ఆదిలాబాద్‌పై మహబూబ్‌నగర్ 0-1 తో విజయం సాధించింది.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles