ఎమ్మెల్యే చొరవతో స్వగ్రామానికి మృతదేహం


Thu,October 17, 2019 01:29 AM

రాయికల్ రూరల్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి అకాల మరణం చెందిన మోతీలాల్ మృతదే హం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చొరవతో బుధవారం స్వగ్రామానికి చెరుకుంది. రాయికల్ మండలం ధర్మాజిపేట గ్రామానికి చెం దిన మోతీలాల్ కొంతకాలంగా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తున్నాడు. వారం క్రితం విధులకు వెళ్తున్న సమయంలో హఠాత్తుగా గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా గుం డెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దుబా యి ఎంబసీతో మాట్లాడగా వారం రోజుల్లోపే మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. అంతేగాక బాధిత కుటుంబానికి అంత్యక్రియల కోసం ఎమ్మెల్యే రూ.12వేలు ఆర్థిక సాయం చేసి శవయాత్రలో పాల్గొని ఉదారత చాటారు. అదే గ్రామానికి చెందిన నేరెళ్ల గంగారాజం ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యా సురేందర్ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


బాధిత కుటుంబాలకు పరామర్శ
జగిత్యాల, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలో ఇటీవల ముగ్గురు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు. పురాణిపేట కు చెందిన బోరగల్ల రాజిరెడ్డి భార్య, తిప్పర్తి హ న్మాండ్లు భార్య, విశ్రాంత ఆబ్కారి శాఖ ఉద్యోగి రవీందర్ గౌడ్ బంధువు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట నాయకులు జీఆర్ దేశాయి, హరి అశోక్ కుమార్, మానాల కిషన్, ఎలగందుల కిషన్, బండారి న రేందర్, సమిండ్ల శ్రీనివాస్, పోచాలు, నారాయ ణ, సత్యనారాయణ గౌడ్, గిరి, శేఖర్, పడాల శ్రీను, వెంకటేశ్వర్లు, తిరుపతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

60

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles