ఘనంగా ట్రస్ట్ వార్షికోత్సవం ..


Tue,October 15, 2019 03:09 AM

పెగడపల్లి: మండలంలోని నంచర్లకు చెందిన శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. గతేడాది కాలంగా ట్రస్ట్ ద్వారా అందించిన సేవా కార్యక్రమాలను స భ్యులు పవర్ పాయింట్ ద్వారా ప్రజంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యతిథిగా పాల్గొన్న ఎంపీపీ గోళి శోభ, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు మాట్లాడుతూ శ్రీరామ ట్రస్ట్ నంచర్లతో పాటు, రాములపల్లి, దేవికొండ గ్రామాల్లో సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ చేపూరి లక్ష్మణ్‌గౌడ్, జిల్లా రిటైర్డ్ జడ్జీ నవమోహన్‌రావు, ఉమ్మడి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ కందగట్ల శ్రీనివాస్, సర్పంచులు గోలి మహేందర్‌రెడ్డి, తోట గంగాభవాని, గొర్రె భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ ఆదినవేని తిరుపతి, ట్రస్ట్ స భ్యులు ముదుగంటి శ్రీధర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, గోలి సురేందర్‌రెడ్డి, పెంట శ్రీనివాస్, చేపూరి లచ్చయ్యగౌడ్, లింగంపల్లి లచ్చ య్య, లింగాల శంకరయ్య, రంగు ప్రభాకర్‌గౌడ్, కుంటాల శ్రీనివాస్, బీ భూమన్న, ఏల్పుల సురేందర్, ఎడ్ల రవీందర్‌రెడ్డి, పెద్ది శేఖర్, కుంటాల లక్ష్మీరాజం, కొమురయ్య తదితరులున్నారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles