సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత


Tue,October 15, 2019 03:09 AM

పెద్దపల్లి కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో సోమవారం పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల గ్రామానికి చెందిన రామినేని గట్టయ్యకు ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంజూరైన 51వేల చెక్కును ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల ఆరో గ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తుందని వివరించారు. ఆరోగ్యశ్రీ వర్తించని కుటుంబాలకు అండ గా ఉండాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తు న్నారని తెలిపారు. కార్యక్రమంలో ఓదెల ఉప సర్పంచ్ కుమారస్వామి, టీఆర్‌ఎస్ యూత్ మం డలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, వార్డుసభ్యుడు రామంచ అనిల్, నాయకులు రమేశ్, వంశీ, సంపత్, సతీశ్ తదితరులున్నారు.

32

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles