పేద యువతులకు కల్యాణలక్ష్మి అండ


Tue,October 15, 2019 03:08 AM

ధర్మారం : పేద యువతులకు కల్యాణలక్ష్మి పథకం అండగా నిలుస్తుందని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మజ అన్నారు. ధర్మారం రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ పి.సంపత్ ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టగా, వారిద్దరూ హాజరై 11 మంది లబ్ధిదారులకు లక్ష 116 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద యువతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టి సాయం అందిస్తున్నారని వివరించారు. పేద యువతులకు ఈ పథకాలు ఎంతో అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ పథకాలు ప్రవేశ పెట్టడంతో బాల్య వివాహాలు పూర్తి తగ్గి పోయాయని, ప్రజల్లో సైతం ఎంతో అవగాహన వచ్చిందని వివరించారు.


కార్యక్రమంలో ధర్మారం సర్పం చ్ పూస్కూరు జితేందర్‌రావు, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఉప స ర్పంచ్ ఆవుల లత, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్,డైరెక్టర్ ఎండీ హఫీజ్, జడ్పీ, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దీన్,ఎండీ రఫి, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, పార్టీ సీనియర్ నేత ముత్యాల బలరాంరెడ్డి, రచ్చపల్లి సర్పంచ్ మోర సుధాకర్, ధర్మారం పట్టణ పార్టీ అధ్యక్షుడు బాస తిరుపతి రావు, నాయకులు సాగంటి కొండయ్య, మోతె కనకయ్య, జక్కుల దామోదర్‌రావు, ఐత వెంకట స్వామి,జనగామ రాజయ్య,గంధం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

40

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles