గ్రామాల్లో విద్యుత్ వెలుగులకు కృషి


Tue,October 15, 2019 03:08 AM

జూలపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రఘువీర్‌సింగ్ పేర్కొన్నారు. తేలుకుంటలో సోమవారం మూడు చోట్ల హైమస్ లైట్ల ఏర్పాటుకు జడ్పీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్, రఘువీర్‌సింగ్‌తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ప్రభుత్వం డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి 3.5 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రఘువీర్‌సింగ్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలోని ప్రధాన కూడళ్లలో హైమస్ విద్యుత్ దీపాల ఏర్పాటుకు పెద్దయెత్తున నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. పంచాయతీ పాలక వర్గం సభ్యులు, గ్రామస్తులు కలిసి స్థానిక సమస్యలు గుర్తించినట్లయితే ఏడాది కాలంలో వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ గ్రామాలాభివృద్ధికి తోడ్పడుతున్నారని వివరించారు. ఇక్కడ సర్పంచ్ సొల్లు పద్మ, ఉప సర్పంచ్ చొప్పరి నర్సింగం, వార్డు సభ్యులు అడ్డగుంట పర్శరాములు, మంద లక్ష్మన్, తీగల కన్కయ్య, జ నుప తిరుపతి, జవ్వాజి నరేశ్, చిప్ప రమేశ్, నా యకులు పల్లె రాములు, శాతళ్ల కాంతయ్య, సొల్లు శ్యామ్, చొప్పరి శేఖర్, నేవూరి మల్లేశం, మడ్డి శ్రీనివాస్, చిగురు రవీందర్‌రెడ్డి, చిప్ప శ్రీకాంత్, మడ్డి నరేశ్, అడ్డ సత్యనారాయణ, తీగల వీరేశం, సుభాన్ తదితరులున్నారు.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles