యుగ పురుషుడు వాల్మీకి


Mon,October 14, 2019 02:55 AM

-మేధోశక్తికి కులంతో పనిలేదని నిరూపించిన మహనీయుడు
-ఉమ్మడి రాష్ట్రంలో వాల్మీకి బోయలను ఎవరూ పట్టించుకోలేదు
-టీఆర్‌ఎస్ సర్కారు వచ్చాకే అన్ని విధాలా సౌకర్యాలు
-జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
-జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంత్యుత్సవాలు
-పాల్గొన్న కలెక్టర్ శరత్


జగిత్యాల రూరల్ : మేధాశక్తికి కులంతో పనిలేదని నిరూపించిన యుగ పురుషుడు మహర్షి వాల్మీకి అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఐఎంఏ హాల్‌లో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ ఎ శరత్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకి జయంతిని రాష్ట్రస్థాయి ఉత్సవంగా నిర్వహించడం వాల్మీకి బోయల అభివృద్ధి, సంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న నిబద్దతను వెల్లడిస్తుందన్నారు. వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా కల్పించేందుకు వీలుగా చెల్లప్ప కమిషన్‌ను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందనీ, కేంద్ర ప్ర భుత్వం ఆమోదించాలన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లు పెంచాలని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రధానమంత్రి మోదీని సైతం కలిశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకునే వారే లేకుండా పోయారనీ, తెలంగాణ వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి బీసీ గురుకులాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ము బారక్, కుల వృత్తులకు అన్ని విధాలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ రామాయణం రచిం చి గొప్ప విషయాలెన్నింటినో తెలియజేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన గొప్ప దార్శనికుడు వా ల్మీకి మహర్షి అని కొనియాడారు. జిల్లా కేంద్రం లో వాల్మీకి బోయలకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామనీ, వాల్మీకి బోయ కులస్థులకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నా రు. తర్వాత టీబీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వా ల్మీకి మహర్షి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ, వాల్మీకి బోయల సంఘ భవనానికి స్థం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజలింగు, వాల్మీకి బోయల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోరె లింగన్న, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు, ప్రవాస భారతీయ సం ఘం జిల్లా అధ్యక్షుడు పెనుకుల అశోక్, నాయకు లు సీపెల్లి రవీందర్, మీనుగు చంద్రశేఖర్, రాగుల పర్శరాం గౌడ్, బ్రహ్మాండభేరి నరేశ్, అలిశెట్టి ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles